calender_icon.png 25 November, 2024 | 8:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిమ్స్‌లో చికిత్స పొందుతూ విద్యార్థిని మృతి

25-11-2024 06:18:12 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): గత కొన్ని రోజులుగా నిమ్స్ లో చికిత్స పొందుతున్న కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థిని శైలజ(16) సోమవారం మృతి చెందింది. సెప్టెంబర్ 30న వాంకిడి గిరిజన గురుకుల పాఠశాలలో భోజనం చేసి 60 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైన విషయం తేలిసిందే. వారందరినీ సమీప ప్రభుత్వ ఆసుపత్రుల్లో విద్యార్థినులకు చికిత్స అందించారు.

నవంబర్ 5వ తేదీన శైలజ(16) అనే విద్యార్థిని పరిస్థితి విషయంచడంతో హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. తీసుకొచ్చిన రోజు నుంచే విద్యార్థిని వెంటిలేటర్ పైనే చికిత్స పొందుతూ, ఇవాళ శైలజ శరీరం చికిత్సకు సహకరించలేదని, పరిస్థితి విషమించి మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. శైలజ వాంకిడి గిరిజన గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది.