10-03-2025 01:36:27 PM
ఆదిలాబాద్,(విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లాలో ఇచ్చోడలో విషాదం చోటుచేసుకుంది. ఇచ్చోడ గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని లాలిత్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. జ్వరంతో బాధపడుతున్న లాలిత్య(13)కు ఆదివారం రాత్రి ఫీడ్స్ వచ్చిందని హాస్టల్ సిబ్బంది చెప్పగా, జ్వరం వచ్చినట్లు తమకు సంచారం ఇవ్వలేదని, తమ కూతురి మరణంపై అనుమానాలు ఉన్నాయని విద్యార్థిని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.