హైదరాబాద్: వనపర్తి జిల్లాలోని గోపాల్‌పేట మండలం(Gopalpet Mandal) ఎస్సీ బాలుర హాస్టల్(SC Boys Hostel)లో సోమవారం ఉదయం ఎనిమిదో తరగతి విద్యార్థి కుప్పకూలిపోయాడు. భరత్ అనే బాలుడు మూర్ఛ రావడంతో కుప్పకూలిపోయిన వెంటనే, హాస్టల్‌లోని ఇతర అబ్బాయిలు అతన్ని ఎంసీహెచ్ ఆసుపత్రి(MCH Hospital)కి తరలించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స విద్యార్థి మృతి చెందినట్లు వైద్యుల తెలిపారు. నాలుగు నెలల క్రితం భరత్ తండ్రి చనిపోయాడు. ఇంత చిన్న వయసులోనే భరత్ చనిపోవడంతో ఆ కుటుంబం తీవ్ర నిరాశకు లోనైంది. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ బంధువులు, ఇతర కుటుంబ సభ్యులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేస్తున్నారు.