calender_icon.png 20 April, 2025 | 10:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు ప్రమాదంలో విద్యార్థిని మృతి

12-04-2025 12:00:00 AM

అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన 

అబ్దుల్లాపూర్‌మెట్, ఏప్రిల్ 11: రోడ్డు ప్రమాదానికి గురై... చికిత్స పొందుతూ విద్యార్థి మృతి చెందిన ఘటన అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా, నారాయణపూర్ మండలం, చిల్లాపూర్ గ్రామా నికి చెందిన కొప్పు శంకరయ్య బతుకుదెరువు కోసం హైదరాబాద్ వలస వచ్చి సైదాబాద్ సింగరేణి కాలనీలో నివసిస్తున్నారు. శంకరయ్య కుమార్తె కొప్పు స్పందన ఘట్ కేసర్ ఉంటూ .. అక్కడే  బీ ఫార్మసీ చదువుతుంది. గురువారం స్పందన, స్నేహితు డైన సాయికుమార్‌తో కలసి ద్విచక్ర వాహనంపై  ఔటర్ రింగ్ రోడ్ నుంచి కోహెడ వైపు వెళుతున్నారు. 

మార్గమధ్యంలో రాగానే వీరు ప్రయాణిస్తున్న బైకును వెనకనుంచి వేగంగా దూసుకొచ్చిన  (ఏపీ 04 బీడీ 6999) నెంబర్ గల కారు  బైకును ఢీ కొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు అంబులెన్స్ సమాచారం ఇవ్వ డంతో అంబులెన్స్ సిబ్బంది సంఘటన స్థలాలు చేరుకొని స్పందన ను, సాయికుమార్ లను హయత్ నగర్ లోని నీలాద్రి ప్రవేట్ హాస్పిటల్ తరలించారు. అం బులెన్స్ డ్రైవర్ వెంటనే వాళ్ల కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు హాస్పిటల్ వద్దకు చేరుకున్నారు. స్పందనకు బలమైన ఆయాలు కావడంతో... చికిత్స పొందు తూ మృతి చెం దినట్లు నీలాద్రి హాస్పిటల్ వైద్యులు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అబ్దుల్లాపూర్ మెట్ ఇన్ స్పెక్టర్ అంజిరెడ్డి తెలిపారు.