calender_icon.png 6 November, 2024 | 4:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గురుకులంలో విద్యార్థి మృతి

06-11-2024 12:10:48 AM

  1. మైదానంలో స్పృహతప్పి పడిపోయిన బాలుడు
  2. పాఠశాల ముందు కుటుంబ సభ్యుల ఆందోళన 
  3. గురుకులాల సంయుక్త కార్యదర్శి విచారణ 
  4. ప్రిన్సిపాల్ సహా ఐదుగురు ఉద్యోగుల సస్పెన్సన్

నిర్మల్, నవంబర్ 5 (విజయక్రాంతి): గురుకుల పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం  ఓ విద్యార్థి నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. నిర్మల్ జిల్లా దిలువార్‌పూర్ మండలం లోలం గ్రామానికి చెందిన ఫయాజ్ హుస్సేన్ (14) నిర్మల్ పట్టణంలోని బాలుర ఎంజేపీ గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు.

మంగళవారం ఉదయం 5 గంటలకే నిద్రలేచిన హుస్సేన్ ఆడుకోవడానికి గ్రౌండ్‌లోకి వెళ్లాడు. అక్కడ స్పృహ తప్పి కుప్పకూలిపోయాడు. నోటి నుంచి నురుగులు కక్కుతూ ఉండటంతో తోటి విద్యార్థు లు హుస్సేన్‌ను లేపి నీరు తాగించేందుకు ప్రయత్నించిన స్పందన లేకపోవ డంతో గురుకుల సిబ్బందికి సమాచార మిచ్చారు. వారు అక్కడికి చేరుకుని హుస్సేన్‌ను ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటి కే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. 

కుటుంబ సభ్యుల ఆందోళన

విద్యార్థులు ఆట స్థలానికి వెళ్లే సమయం లో పీఈటీ లేకపోవడం, విద్యార్థుల కేర్ టేక ర్ పాఠశాలకు రాకపోవడం, విధుల్లో ఉండాల్సిన ఏఎస్‌ఎం సుజాత, ప్రిన్సిపాల్ పాఠ శాలలో లేకపోవడం వల్లనే విద్యార్థిని ఆసుపత్రికి తరలించడంలో జాప్యం జరిగిందని విద్యార్థి కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తూ పాఠశాల వద్ద ఆందోళన చేశారు.

విద్యార్థి మృతిపై అనుమానాలు ఉన్నాయని, కలెక్టర్, ఎస్పీ రావాలని డిమాండ్ చేస్తూ ఎన్‌టీఆర్ ట్యాంకుబాండు వద్ద రోడ్డుపై భైఠాయించారు. కొందరు పాఠశాలలో ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. ఎస్పీ జానకి షర్మిల, ఆర్డీవో రత్న కళ్యాణి, పట్టణ పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడా రు. విద్యార్థి మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని నచ్చజెప్పారు. 

రూ.2 లక్షల పరిహారం, ఉద్యోగం

విద్యార్థి కుటుంబలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని, రూ.50 లక్షలు పరిహారం అందించాలని విద్యార్థి బంధువులు, డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అర్జున్ గురుకుల కార్యదర్శి సైదులు, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్‌తో ఫోన్‌లో కోరారు.

మంత్రులు  సీతక్క, పొన్నం ప్రభాకర్ స్పందించి విద్యార్థి కుటుంబంలో ఒకరికి వారం రోజుల్లోనే కాంట్రాక్టు ఉద్యోగం ఇస్తామని, రూ.2లక్షల పరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు. అలాగే ప్రభుత్వం నిర్మించే ఇందిరమ్మ ఇంటిని మంజూరు చేస్తామని హమీ ఇచ్చారు. దీంతో కుటుంబ సభ్యులు శవ పంచనామకు అంగీకరించారు. 

ఐదుగురిపై సప్పెన్షన్ వేటు

విద్యార్థి మృతితో ప్రభుత్వం స్పందించింది. గురుకులాల కార్యదర్శి సైదులు ఆదేశాలతో సంయుక్త కార్యవర్శి తిరుపతి నిర్మల్‌కు వెళ్లి విచారణ చేశారు. విద్యార్థు లు, ఉపాధ్యాయులతో వేర్వేరుగా మాట్లా డి వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థి కుప్పకూలిన సమయంలో సిబ్బంది ఎవ రూ లేకపోవడంతో వారిని బాధ్యులను చేస్తూ ప్రిన్సిపాల్ సంతోష్‌కుమార్‌తో పా టు డ్యూటీ టీచర్లు అరుణ్‌కుమార్, రమేష్‌కుమార్, ఏఎన్‌ఎం సుజాత, కాట్రాంక్టు ఉద్యోగి పెంటన్నలను సస్పెండ్ చేశారు. 

విద్యార్థినులకు పరామర్శ

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 5 (విజయక్రాంతి): అస్వస్థతకు గురై హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన ఆశ్ర మ పాఠశాల విద్యార్థినులను మం గళవారం మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ పరామర్శించారు. వారి ఆరోగ్యంపై వైద్యు లను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని నిమ్స్ డైరెక్టర్ బీరప్పకు సూచించారు.