calender_icon.png 1 April, 2025 | 8:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నల్లవాగు గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ నిర్లక్ష్యంతో విద్యార్ధి మృతి

29-03-2025 10:59:16 PM

ఎనిమిది రోజులైనా జ్వరంతో బాధపడితే కనీసం పట్టించుకోని ప్రిన్సిపాల్..

విద్యార్థి మృతి చెందడంతో అందుబాటులో లేని ప్రిన్సిపాల్..

మా అబ్బాయికి కారణం ప్రిన్సిపాల్ ఏ కారణం అని తల్లిదండ్రుల ఆరోపణ..

సిర్గాపూర్: సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల పరిధిలోని నల్లవాగు (సుల్తానాబాద్) గురుకుల పాఠశాలలో పెద్ద శంకరంపేట మండలం చిలపల్లి గ్రామానికి చెందిన దార నిఖిల్ కుమార్ 9వ తరగతి చదువుతున్నాడు. వారం రోజుల నుంచి జ్వరం రావడంతో ఎవరు పట్టించుకోకపోవడంతో కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. రెండు రోజుల క్రితం తల్లిదండ్రులు గురుకుల పాఠశాల నుంచి నారాయణ్ ఖేడ్ ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లడంతో పరిస్థితి విషమించడంతో సంగారెడ్డి నుంచి హైదరాబాద్ ఆసుపత్రి తీసుకెళ్లారు. దార నిఖిల్ కుమార్ (13) శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ ఆసుపత్రిలో ఆకస్మాత్తుగా మృతి చెందాడు.

ఆస్పత్రి నుంచి మృత దేహాన్ని శనివారం  తీసుకొని గురుకుల పాఠశాలకు తీసుకురాగా పోచపూర్ సమీపంలో పోలీసులు శవాన్ని అడ్డుకున్నారు. హైదరాబాదు నుంచి వచ్చిన ప్రిన్సిపాల్ తిరుపతయ్య ను పోలీస్ స్టేషన్లో ఉంచారు. తల్లితండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. మా కుమారుడు ఆరోగ్యంగానే ఉండేవాడని గురుకుల పాఠశాలలో వారం రోజులుగా  మా కుమారునికి జ్వరం వచ్చిన మాకు సమాచారం ఇవ్వలేదని, ఆసుపత్రికి తీసుకు పోలేదని, వారం రోజుల నుండి అన్నం నీళ్లు తినకుండా పండుకొని ఉన్నాడని కనీసం స్కూల్ టీచర్, వార్డును, ప్రిన్సిపాల్ కన్నెత్తి చూడలేదన్నారు. విద్యార్థి పరిస్థితి వవిషమించడంతో ఇంటికి తీసుకెళ్లాలని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారన్నారు.

మాకు చెప్పడంతో హడావుడిన తీసుకెళ్ళాం, మా అబ్బాయికి ఏమైందని టీచర్ అలాగే ప్రిన్సిపాల్ లేడు ఉపాధ్యాయులకు అడుగుదామంటే మమ్మల్ని స్కూల్ నుంచి బయటకు గేంటేసినంత పని చేశారని విద్యార్థి తండ్రి దార సుధాకర్, తల్లి పూలమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. మా అబ్బాయి మరణానికి పూర్తి కారణం ప్రిన్సిపాల్ తిరుపతయ్య పూర్తిగా బాధ్యత వహించాలన్నారు. ఆయన నిర్లక్ష్యం వల్లనే ఇలా జరిగిందని, మా అబ్బాయికి వారం రోజుల నుంచి కనీసం హాస్పిటల్ కి కూడా తీసుకెళ్లలేదని తల్లితండ్రులు కన్నీరు మున్నిరయ్యారు. ఆయన హెల్త్ సూపర్వైజర్ హాస్పిటల్ కు తీసుకెళ్లి ఉంటే మా కొడుకు బతికేవాడని అన్నారు.

గతంలో కూడా ప్రిన్సిపాల్ తిరుపతయ్యపై అనేక ఆరోపణలు ఉన్నాయని, విద్యార్థులను, పేరెంట్స్ని, టీచర్లను అందరిని తన నోటికి ఏది వస్తే అది తిట్టి కులం పేరుతో దూసిస్తాడని విద్యార్థులు తెలిపారు. ఈయన నిర్లక్ష్యం వల్ల ఇప్పటికే అందోల్, సింగూర్ రామక్కపేట్ అనేక స్కూల్ నాలుగు మార్లు ప్రిన్సిపాల్ సస్పెండ్ అయినా తీరు మారలేదన్నారు. స్కూల్లో ఎప్పుడు అందుబాటులో ఉండడు గాని, విద్యార్థులతోనే బీర్లు - విస్కీ తెప్పించుకుని క్వాటర్స్లోనే తప్ప తాగి పడుకుంటాడని నల్లవాగు గ్రామస్తులే చాలా సార్లు మందలించిన ఆయనలో మార్పు రాలేదన్నారు. స్కూల్లో టెస్ట్ బుక్-ఇతర మెటీరియల్ హెడ్ ఆఫీస్ వాళ్లకు తెలియకుండా అక్కడ ఉన్నా ఒక సీనియర్ ఉద్యోగితో కలిసి అమ్ముతున్నాడని, తోటి విద్యార్థులు వాపోయారు.

ఇలా చెప్పుకుంటూ పొతే ఈయన ప్రిన్సిపాల్ బాగోతం చాలా ఉందని వారు వాపోయారు. ఏమైనా అంటే నాకు హెడ్ ఆఫీస్లో చాలా మంది తెలుసు నన్ను ఎవడు ఏం పీకలేడని అక్కడున్న టీచర్స్ దగ్గర బెదిరించుకుంటూ మాట్లాడుతాడని ఉపాధ్యాయులు కూడా వాపోయారు. విద్యార్థులకు రావాల్సిన కాస్మెమెటిక్స్ చికెన్, మటన్ ఎగ్స్ కూడా సరిగా పెట్టకుండా దొబ్బి తింటాడని విద్యార్థులు ఇతనిపై కంప్లైట్ చేశారు. విద్యార్థులకు అందుబాటులో ఉండని నోటికి ఏదీ వస్తే అది మాట్లాడే ఆహంకారిని వెంటనే సస్పెండ్ చెయ్యాలని ఎన్నో మార్లు విద్యార్థుల తల్లిదండ్రులు చెప్పిన పట్టించుకోలేదన్నారు. తండ్రి దార సుధాకర్ కాళ్లు విరిగిపోవడంతో వికలాంగుడుగా ఉన్నారు.

పూలమ్మ కూలి పని చేసి బతుకుతున్నారు, కూతురు శృతి ఉన్నారు. నిరుపేద కుటుంబం ఒక ఎకరం భూమి కూడ లేని పరిస్థితి రెక్క ఆడితేనే డొక్కాడని బ్రతుకులు ఒక్కగాని ఒక్క కొడుకు చనిపోవడంతో కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు శోకసముద్రంలో మునిగిపోయారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, సిపిఐ జిల్లా నాయకులు చిరంజీవి, మాదిగ దండోరా అధ్యక్షులు అలిగే జీవన్, సిపిఐ జిల్లా కార్యవర్గ కార్యదర్శి ఆనంద్, సిర్గాపూర్ మాజీ ఎంపీటీసీ సంజీవ్ పాటిల్, మాజీ సర్పంచ్ రవీందర్ పాటిల్, కల్హెర్ జడ్పిటిసి నరసింహారెడ్డి, నాయకులు ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.