calender_icon.png 19 April, 2025 | 11:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పిడుగుపాటుకు విద్యార్థి మృతి

11-04-2025 12:32:45 AM

కొండాపూర్, ఏప్రిల్ 10: పిడుగుపాటుకు కళాశాల విద్యార్థి మృతి చెందిన ఘటన కొండాపూర్ మండలంలో చోటు చేసుకుంది. కొండాపూర్ మండలం గంగా రం గ్రామానికి చెందిన సంతోష్(17) మరో ఇద్దరు మిత్రులతో కలిసి కళాశాలకు వెళ్ళొస్తుండగా భారీ వర్షం పడడంతో చెట్టు కిందికి వెళ్లారు. దీంతో చెట్టుపై పిడుగు పడటంతో సంతోష్ అక్కడికక్కడే మృతి చెంద గా ఇద్దరు వ్యక్తులు చికిత్స పొందుతున్నారు. సంతోష్ మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలుఅలుముకున్నాయి.