16-03-2025 10:25:27 PM
మేడిపల్లి (విజయక్రాంతి): ఆర్టీసీ బస్సు ఢీకొని 7వ తరగతి విద్యార్థి మృతి చెందిన ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి కాచవానిసింగారం గ్రామంలో ఈ విషాదం చోటు చేసుకుంది. స్కూటీపై పదవ తరగతి బాలుడు అభిలాష్, ఏడవ తరగతి బాలుడు అక్షిత్(13) ఇద్దరూ కలిసి వెళ్తుండగా కాచివానిసింగారం మణిదీప కాలనీ వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొంది. దాంతో అక్షిత్ మృతి చెందాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న మేడిపల్లి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బస్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే ప్రమాదం జరిగినట్టు బంధువులు ఆరోపిస్తున్నారు.