calender_icon.png 22 December, 2024 | 4:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డ్రైవర్ నిర్లక్ష్యంతో విద్యార్థిని మృతి

14-09-2024 12:59:13 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 13 (విజయక్రాంతి): స్కూల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో ఓ ఐదేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మల్లంపేట్‌లోని ఓక్లా స్కూల్‌లో మహన్విత(5) ఫస్ట్ క్లాస్ చదువుతోంది. శుక్రవారం స్కూల్‌లో మహన్వితపై నుంచి స్కూల్ బస్సు వెళ్లింది. ఈ ప్రమాదంలో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందగా.. డ్రైవర్‌ను స్కూల్ యాజమాన్యం ఘటనా స్థలం నుంచి పంపించినట్లు సమాచారం.

తదనంతరం మహన్విత బస్సుపై నుంచి జారిపడిందని స్కూల్ యాజమాన్యం చిన్నారి తల్లిదండ్రులకు సమాచారం అందించింది. స్కూల్‌కు చేరుకున్న మహన్విత పేరెంట్స్.. తమబిడ్డ చావుపై తమకు అనుమనాలున్నాయని.. మహన్విత చావుకు కారణమైన డ్రైవర్‌ను అరెస్టు చేయడంతో పాటు స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని స్కూల్ ఎదుట ఆందోళనకు దిగారు. చిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.