calender_icon.png 28 November, 2024 | 7:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనారోగ్యంతో విద్యార్థిని మృతి

27-10-2024 01:11:10 AM

సిబ్బంది నిర్లక్ష్యమే కారణమంటూ కుటుంబీకుల ఆందోళన 

ఆదిలాబాద్, అక్టోబర్ 26 (విజయక్రాంతి): అనారోగ్యంతో ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న ఓ ఆదివాసీ విద్యార్థిని మృతి చెందిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో ఆందోళనకు దారి తీసింది. ఇంద్రవెళ్లి మండలంలోని వాల్గొండకు చెందిన మడావి గంగోత్రి (15) ఇంద్రవెల్లి ఆశ్రమ బాలికల వసతి గృహాంలో 9వ తరగతి చదువుతుంది. దసరా సెలవులు ముగించడంతో తిరిగి ఈ నెల 21న పాఠశాలకు వెళింది.

పాఠశాలకు వచ్చిన గంగోత్రికి రెండు రోజులలుగా సల్ప అనారోగ్యంతో బాధపడుతుంది. శనివారం తెల్లవారుజమున వాంతులు, విరేచనలు కావడంతో సిబ్బంది వెంటనే మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు నిరహించిన వైద్య సిబ్బంది ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. బాలికను పరీక్షించిన రిమ్స్ వైద్యలు అప్పటికే మృతి చెందిందని  నిర్ధారించారు.

కాగా, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా విద్యార్థిని మృతిచెందందని ఆరోపిస్తూ కుటుంబీకులు, ఆదివాసీ సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. మృతదేహాన్ని మృతురాలి గ్రామమైన వాల్గోండ కు తరలిస్తుండగా అంబులెన్స్‌ను ఆదివాసీ సంఘాల నాయకులు అడ్డుకొని, తిరిగి ఇంద్రవెల్లికి తీసుకొస్తుండగా ఉట్నూర్ సీఐ మొగిలి అడ్డుకున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, అప్పుడే మృతదేహాన్ని గ్రామానికి తరలిస్తామని ఆదివాసీ సంఘాల నాయకులు స్పష్టంచేశారు.