15-02-2025 01:39:01 AM
వికారాబాద్, ఫిబ్రవరి 14: వసతి గృహాల్లో ఉంటున్న పేద విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వo ఆడుకుంటుందని వికారాబాద్ జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ఆరోపించారు. రెండు రోజుల క్రితం వికారాబాద్ మునిసిపల్ పరిధిలోని మద్గుల్ చిట్టంపల్లి తండా కు చెందిన దేవేందర్ కులక్చర్ల లోని వసతి గృహంలో మృతి చెందిన విషయం తెలిసిందే.
ఈ మేరకు శుక్రవారం డాక్టర్ ఆనంద్ తండాకు వెళ్లి బాధ్యత కుటుంబీకులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభమైన నాటి నుండి వసతి గృహాల్లో విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే విద్యార్థులు అస్వస్థతకు గురికావడం మృతి చెందడం జరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా స్థానిక మాజీ కౌన్సిలర్ గోపాల్, బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నర్సింలు తదితరులు పాల్గొన్నారు.