ఎల్బీనగర్, జనవరి 26: ప్రభుత్వ హాస్టల్లో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్ప డిన ఘటన ఆదివారం రాత్రి జరిగింది. హయత్‌నగర్ శివారు కుంట్లూరులోని గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ కళాశాల (ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్)లో నాగర్‌కర్నూల్ జిల్లా కొండనాగుల మండలం అంబగిరి గ్రామానికి చెందిన ఉడతనూరి సౌమ్య (17) బైపీసీ చదువుతున్నది.
ఆదివారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో విద్యార్థినులందరూ భోజనానికి వెళ్లగా.. తరగతి గదిలోకి వెళ్లిన సౌమ్య ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నది. విద్యార్థిని ఆత్మహత్యకు సంబంధిం చి కారణాలు తెలియరాలేదు.