calender_icon.png 28 November, 2024 | 10:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గురుకులంలో విద్యార్థి ఆత్మహత్య

28-11-2024 12:46:30 AM

కొత్తకోట, నవంబర్ 27: తండ్రి మందలించాడని మనస్థాపం చెంది కొడుకు ఆత్మహత్య చేసుకున్న ఘటన వనపర్తి జిల్లా మదనాపురంలోని గురుకులంలో జరిగింది. కొన్నూర్ గ్రామా నికి చెందిన శ్రీనివాసులు, సత్యమ్మ దంపతుల కుమారుడు ప్రవీణ్ (12) మదనాపురంలోని ఎస్సీ బాలుర గురుకులంలో ఏడో తరగతి చదువుతున్నాడు.

హాస్టల్‌లో ఆడుతుండగా అనుకోకుండా ప్రవీణ్ తల మరో విద్యార్థి తలకు తగిలింది. దీంతో ప్రవీణ్‌కు తలనొప్పి వస్తుందని చెప్పడంతో టీచర్లు మందులు ఇచ్చి, విషయాన్ని అతడి తండ్రికి ఫోన్ చేసి చెప్పారు. ఈ క్రమంలో ఫోన్‌లోనే అతడిని తండ్రి మందలించాడు. అనంతరం తలనొప్పి ఎక్కువ కావడంతో బుధవారం డార్మెటరీలో ప్రవీణ్ ఫ్యాన్‌కు దుప్పటితో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్ప డ్డాడు.

విద్యార్థులు సమాచారం ఇవ్వడంతో ప్రవీణ్‌ను బంధువులతో కలిసి వనపర్తి జిల్లా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారిం చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.