నిజామాబాద్, (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లాలోని రుద్రూర్లో మండలం అక్బర్ ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల హాస్టల్ లో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఉరేసుకుని చనిపోవడం ఉద్రిక్త పరిస్థితిలకు దారి తీసింది. జిల్లాలోని రుద్రూరు మండలం అక్బర్ నగర్ లో ఉన్న వ్యవసాయ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని లింగువాడు రక్షిత (15) హాస్టల్లోనే బాత్రూంలో కిటికీ ఊచలకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. శనివారం ఉదయం రక్షిత ఉరివేసుకొని ఉండటాన్ని గమనించిన హాస్టల్ విద్యార్థులు కళాశాల సిబ్బందికి సమాచారం అందించారు. రక్షితది అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం హుస్నాపూర్ గ్రామం, ఐదు రోజుల క్రితమే రక్షిత హాస్టల్ చేరింది, విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. సంఘటన స్థలాన్ని రుద్రూర్ సీఐ జయేష్ రెడ్డి, ఎస్ఐ సాయన్న చేరుకొని విచారణ జరిపారు. రక్షిత తల్లిదండ్రులు రాకముందే మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించడాని, కళాశాల విద్యార్థులు వ్యతిరేకించడంతో హాస్టల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.