calender_icon.png 6 February, 2025 | 7:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్కూల్ భవనం పైనుంచి దూకి విద్యార్థి సూసైడ్

06-02-2025 01:03:49 AM

 ప్రిన్స్‌పాల్ మందలించాడని మనస్థాపం

షాద్‌నగర్, ఫిబ్రవరి 5: ఉపాధ్యాయుడు మందలించాడనే కారణంతో విద్యార్థి పాఠశాల భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రంగారెడ్డి జ్లిలా షాద్‌నగర్ పట్టణంలో బుధవారం సాయం  జరిగింది. షాద్‌నగర్ పట్టణానికి చెం  బీజేపీ పట్టణ అధ్యక్షుడు హరిభూషణ్ కుమారుడు నీరజ్ స్థానిక శాస్త్ర పాఠశాలలో పదవతరగతి చదవుతున్నాడు.

అదే పాఠశాలకు చెందిన మరో విద్యార్థితో మాట్లాడడం గమనించిన పాఠశాల ప్రిన్స్‌పాల్ తన కార్యాలయ ఆవరణలో నీరజ్‌ను తీవ్రంగా మంద  దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన నీరజ్ అక్కడి నుంచి నేరుగా టాయిలేట్‌కు వెళ్తున్నాని చెప్పి.. పాఠశాల భవనం పైకి వెళ్లి కిందకు దూకాడు.

విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని, నీరజ్‌ను స్థానిక దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమించడంతో వైద్యుల సూచనల మేరకు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ద  తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. దీంతో తల్లిదండ్రులు రోధనలు మిన్నంటాయి.

కాగా ప్రిన్స్‌పాల్ దూషించడంతోనే తమ కుమారుడు మృతిచెందినట్లు వారు ఆరోపించారు. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆందోళనకు దిగారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఘట  కారుకులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమిం  నీరజ్ తల్లిదండ్రుల ఫిర్యాదుల మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

విద్యార్థి ఆత్మహత్యపై మహబుబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ స్పందించారు. విద్యార్థులకు  ఆహ్లాద వాతావరణం ఉం  పాఠశాల యాజమాన్యం చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి, బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.