calender_icon.png 6 February, 2025 | 3:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గురుకుల పాఠశాలలో విద్యార్థిని ఆత్మహత్య

06-02-2025 12:02:15 PM

బాలానగర్,(విజయక్రాంతి): మహబూబ్ నగర్ లో దారుణం చోటుచేసుకుంది. బాలానగర్ గురుకుల పాఠశాలలో విద్యార్థిని ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం జరిగింది. వివరాల్లోకి వెళితే... కల్వకుర్తికి చెందిన ఆరాధ్య అనే విద్యార్థిని బాలనగర్ మండల కేంద్రంలోని బాలికల రెసిడెన్సియల్ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. ఏం జరిగిందో ఏమో కానీ ఇవాళ ఆరాధ్య క్లాస్ రూంలోనే ఉవేసుకుంది. తోటి విద్యార్థినిలు ఉదయం 6.30 గంటలకు సీలింగ్ ఫ్యాన్ కు వేలాడుతున్న ఆరాధ్యను చూసి టీచర్లకు చెప్పడంతో కిందకు దింపారు.

హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు విద్యార్థిని అప్పటికే చనిపోయిందని వెల్లడించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మృతురాలు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. కూతురి మరణవార్త విన్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. కాగా, ఆరాధ్య ఆత్మహత్యకు కారణాలేంటనే వివరాలు తెలియాల్సి ఉంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తుచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.  మహబూబ్ నగర్ లో దారుణం చోటుచేసుకుంది. బాలానగర్ గురుకుల పాఠశాలలో విద్యార్థిని ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం జరిగింది. వివరాల్లోకిమహబూబ్ నగర్ లో దారుణం చోటుచేసుకుంది. బాలానగర్ గురుకుల పాఠశాలలో విద్యార్థిని ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం జరిగింది. వివరాల్లోకి