calender_icon.png 19 April, 2025 | 7:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో కుప్పకూలిన విద్యార్థి

05-04-2025 01:11:44 AM

మేడ్చల్ సీఎంఆర్ కళాశాలలో ఘటన

మేడ్చల్, ఏప్రిల్ 4 (విజయక్రాంతి): క్రికెట్ ఆడుతూ విద్యార్థి గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందిన ఘటన మేడ్చల్‌లో జరిగింది. సీఎంఆర్ కళాశాలలో బీటెక్ చివరి సంవత్సరం చదువు తున్న వినయ్ అనే విద్యార్థి తోటి విద్యార్థులతో శుక్రవారం సాయంత్రం కాలేజీ గ్రౌండ్ లో క్రికెట్ ఆడుతూ ఫీల్డింగ్ చేస్తుండగా గుండెపోటుతో కుప్పకూలిపోయాడు.

వెంటనే విద్యార్థులు ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే విద్యార్థి మరణించిన ట్టు సంతరించారు. తమతో ఆనందంగా క్రికెట్ ఆడుతూ కళ్ళముందే కుప్పకూలి మృతిచెందడంతో తోటి విద్యార్థులు కన్నీరు మున్నీరయ్యారు. వినయ్ ఖమ్మం జిల్లాకు చెందినవాడు. వినయ్ ఫీలింగ్ చేస్తూ కుప్పకూలిన దృశ్యాలను చూస్తూ కాలేజీ విద్యార్థులు కంటతడి పెడుతున్నారు.