* టీచర్లు అవహేళనతో మనస్థాపానికి గురైన బాలిక
* ఆలస్యంగా వెలుగులోకి..
ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 30 (విజయక్రాంతి): ఉపాధ్యాయులు అవ చేశారని ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఇబ్రహీంపట్నం పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు వివరాల ప్రకారం.. రాజేంద్రనగర్, బండ్లగూడలో నివాసముంటున్న నాగరాజు కు ఇద్దరు కొడు ఇద్దరు కూతు ళ్లు ఉన్నారు.
రెండో కూతురు గడ్డి లావణ్య ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని చర్లపటేల్‌గూడ గ్రామ సమీపంలోని ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్ స్కూల్ లో పదో తరగతి చదువుతూ, హాస్టల్‌లో ఉంటుంది. అయితే గత నెల నవంబర్ 9వ తేదీన మొదటి అంతస్తు నుంచి దూకడంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి.
విషయాన్ని హాస్టల్ వార్డెన్ తల్లిదండ్రులకు చెప్పగా ఆమెను గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఆమె కోలుకున్నాక ఇలా ఎందుకు చేశావని తల్లిదండ్రులు కూతురిని అడిగారు. నాకు చదువురావడం లేదని టీచర్లు హేళన చేసిందని, అందుకే ఇలా చేసినట్లు చెప్పింది.
ఈ నేపథ్యంలో ఇందుకు కారకులైన స్కూ ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు ఫిర్యాదు ఇవ్వడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.