calender_icon.png 15 March, 2025 | 5:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మార్క్స్ స్ఫూర్తితో పోరాటాలు

15-03-2025 12:24:32 AM

ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య 

ఖమ్మం, మార్చి 14 ( విజయక్రాంతి ): ప్రపంచాన్ని వ్యాఖ్యానించడమే గాక మార్చే విధానాన్ని కారల్ మార్క్స్ సిద్ధాంతాన్ని తయారు చేశారని, ఆ వెలుగులో కార్మిక వర్గ చైతన్యంతో సమాజాన్ని మార్చటానికి ప్రజలు పోరాటాలు చేయాలని సిపిఐ ఎంఎల్ మాస్‌లైన్ రాష్ట్ర నాయకులు ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య పిలుపునిచ్చారు.

శుక్రవారం ఖమ్మంలో రామ నర్సయ్య విజ్ఞాన కేంద్రంలో కార్ల మార్క్స్ 142వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. కారల్ మారక్స్ చిత్రపటానికి పూ లు వేసి నివాళులర్పించారు. అనంతరం గుమ్మడి నరసయ్య ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు ఆవుల అశోక్ సీవై పుల్లయ్య, పార్టీ జిల్లా నాయకులు సిహెచ్ శిరోమణి, టీ ఝాన్సీ, కే శ్రీనివాస్,ఆజాద్, పిడిఎస్‌యూ నాయకులు వి వెంకటేష్, టి లక్ష్మణ్, జి అశోక్, యశ్వంత్, ప్రసాద్, చిలకల నరసింహారావు, వెంకట్, తదితరులు పాల్గొన్నారు.