calender_icon.png 26 October, 2024 | 9:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

‘కూలీ’ కోసం కోటి తిప్పలు

05-08-2024 02:11:32 AM

  1. నాట్ల కోసం సుదూర ప్రాంతాలకు మహిళలు.. 
  2. వాహనాల్లో ప్రమాదకరంగా ప్రయాణం

సూర్యాపేట, ఆగస్టు4: కూటి కోసం కోటి విద్యలు అనేది నానుడి. కానీ సూర్యాపేట ప్రాంతంలో అది కాస్త కూలీ కోసం కోటి తిప్పలుగా మారిపోయింది. జిల్లాలోని గరిడేపల్లి, పాలకవీడు, నేరేడుచర్ల మండలాలకు చెందిన గానుగుబండ, గరిడేపల్లి, కల్మల్‌చెర్వు, సర్వారం, జాన్‌పహాడ్‌లతో పాటు పలు గ్రామాల్లో మహిళా కూలీలు ఇతర ప్రాంతాల్లో వరినాట్లు వేసేందుకు వెళ్తున్నా రు. ప్రతి రోజు పనుల నిమిత్తం నూతనకల్, ఆత్మకూర్ (ఎస్), సూర్యాపేట మండలాలకు వెళ్తున్నారు.

టాటాఏస్, బొలెరో వంటి వాహనాల్లో ప్రమాదమని తెలిసినా తప్పని సరి పరిస్థితుల్లో సామర్థ్యానికి మించి ప్ర యాణిస్తుంటారు. వాహనాల చుట్టూ ఉన్న ఇనుపకడ్డీలు, టాప్‌పై మహిళలను కూర్చోబెట్టుకుని, డ్రైవర్లు వాహనాలను మితిమీరిన వేగంతో పోనిస్తుంటారు. సంబంధిత అధికారులు స్పందించి, కూలీల ప్రయాణం సజావుగా జరిగేలా తగు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.