calender_icon.png 3 February, 2025 | 10:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ 420 హామీలు నెరవేర్చే వరకు పోరాటం...

03-02-2025 08:03:50 PM

మాజీ మంత్రి రామన్న...

ఆదిలాబాద్ (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన 420 హామీలను నెరవేర్చేంత వరకు ప్రశ్నిస్తూనే ఉంటామని, ప్రభుత్వ వైఫల్యాలను బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు క్షేత్ర స్థాయిలో ప్రజలకు వివరించాలని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ ఆధ్వర్యంలో ముద్రించిన నూతన సంవత్సర క్యాలెండర్, డైరీని ఆయన ఆవిష్కరించారు. అనంతరం జోగు రామన్న మాట్లాడుతూ... గత పది ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి చేసిన అభివృద్ధి పనులతో పాటు తెలంగాణ ఉద్యమ నేపథ్యాన్ని గుర్తుచేస్తూ ప్రతి కార్యకర్త అదే స్ఫూర్తితో మరోసారి ప్రజలకు అండగా ఉండేలా ముందుండాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అనేక బూటకపు హామీలు ఇచ్చి అధికారంల్లోకి వచ్చిందని, ప్రభుత్వ విధానాలతో ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారని అన్నారు. ప్రజా గొంతుకై నిలబడి ప్రజల పక్షాన పోరాడాలని శ్రేణులకు పిలుపునిచ్చారు.