calender_icon.png 23 March, 2025 | 2:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోరాటం బీఆర్ఎస్ కి కొత్తేమీ కాదు..

22-03-2025 05:37:36 PM

- ఎండుతున్న పంటలను సిగ్గులేకుండా చూస్తూ కూర్చున్న కాంగ్రెస్ ప్రభుత్వం..  

- గజ్వేల్లో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మహా పాదయాత్రకు సంఘీభావం తెలిపిన ఎమ్మెల్సీ కవిత..

గజ్వేల్: ఆనాడు కాంగ్రెస్ మీద పోరాటం తెలంగాణ సాధించామని, ఈనాడు అదే కాంగ్రెస్ మీద పిడికిలేత్తి పోరాటం చేస్తే గోదావరి నీళ్లు తప్పకుండా మన పొలాలకు వస్తాయనీ, బీఅర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(BRS MLC Kavitha) అన్నారు. గోదావరి కన్నీటి గోస పేరిట గోదావరిఖని నుంచి బీఅర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెలే కోరుకంటి చందర్ ప్రారంభించిన మహా పాదయాత్ర శనివారం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీకి చేరుకోగా ఎమ్మెల్సీ కవిత సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ పడవల పోటీ పెట్టుకున్న గోదావరి నదిని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఎడారిల మార్చి వేసిందన్నారు. లక్షలాది ఎకరాలు ఎండుతున్నా సిగ్గు లేకుండా చూస్తూ కూర్చుంటున్నారే తప్ప కాంగ్రెస్ నాయకులకు రైతుల కష్టాలు పడ్తాలేవన్నారు.

సమ్మక్క సారక్క వద్ద కేసీఅర్(KCR) వచ్చాక డ్యాం నిర్మించిన అనంతరం స్టోరేజి వచ్చిందనీ, కేవలం రూ.6 కోట్లు ఖర్చుపెడితే మోటార్లు రిపేర్ అవుతాయని, దానితో లక్ష ఎకరాలకు సాగునీరు అంది బంగారు పంటలు పండుతాయన్నారు. మంత్రులు వెళ్లి బటన్ ఒత్తుతే మోటార్లు పనిచేస్తలేవట అది కూడా తెలవకుండ ఇరిగేషన్ మంత్రి అక్కడికి పోయిండనీ ఎద్దేవా చేశారు. మేడి గడ్డ వద్ద ఏదో జరిగిందని ఎన్నికల ముందు కాంగ్రెస్, బిజేపీ లు కలిసి కుట్ర పన్నారని, గత పదేండ్ల బీఅర్ఎస్ పాలనలో గోదావరి నది యెట్లా పొంగిపోర్లిందో ఆ వైభవాన్ని తెచ్చుకోవడానికి నీళ్ల కోసం పోరాటం చేయడాన్ని పాదయాత్ర చేస్తున్న కోరుకంటి చందర్ కు వందనాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కవితతో పాటు గజ్వేల్ బీఅర్ఎస్ పార్టీ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జ్ వంటేరు ప్రతాపరెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.