calender_icon.png 22 February, 2025 | 12:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూ నిర్వాసిత ఆదివాసీలకు న్యాయం జరిగే వరకు పోరాటం

21-02-2025 08:13:57 PM

JAC జాతీయ అధ్యక్షులు చందా లింగయ్య దొర..

మణుగూరు (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్(BTPS) ఆదివాసి భూ నిర్వాసితులకు న్యాయం జరిగే వరకూ పోరాటం ఆగదని ఆదివాసి సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే, మాజీ జడ్పీ చైర్మన్ చందా లింగయ్య దొర అన్నారు. శుక్రవారం హైదరాబాద్ ప్రజా భవన్ లో జరిగిన ప్రజాదర్బార్ లో... తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజాదర్బార్ లో... BTPS నిర్మాణంలో భూములు కోల్పోయిన ఆదివాసీలకు 2014 సంవత్సరం నుండి ఇప్పటివరకు గత ప్రభుత్వ సీఎం KCR నాయకత్వంలో ఆదివాసీలకు తీరని అన్యాయం జరిగినదని, గిరిజన భూములపై గిరిజనేతరులను కాస్టులో ఉన్నట్లు తప్పుడు రికార్డులు సృష్టించి గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి వరకు అధికారులు ప్రభుత్వం కేటాయించిన భూమి ఖరీదు మొత్తం సొమ్ము రూ.4 వందల కోట్లు దిగమింగినారని, దీనిపై సమగ్ర దర్యాప్తు చేసి దోషులను శిక్షించి నష్టపోయిన ఆదివాసీలకు భూమి ఖరీదుతో పాటు కుటుంబానికి ఒక ఉద్యోగం, ప్రత్యేక ప్యాకేజీ, గృహ నిర్మాణం, పునరావాసం కల్పించాలని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు మెమోరాండంను అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. సానుకూలంగా స్పందించిన డిప్యూటీ సీఎం బట్టి తక్షణమే మెమోరాండం ద్వారా తెలిపిన అవకతవకలపై విచారణ జరిపించి ఆదివాసీలకు న్యాయం చేస్తానని, ఆదివాసీలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చినారన్నారు. కార్యక్రమంలో BTPS పరిధిలోని ఆదివాసి బాధితులు కుంజ వెంకటరమణ, చిడెం నాగేశ్వరరావు, పూనెం జయ గోపాల్, కుంజా నాగేశ్వరరావు, మడకం పెంటయ్య, కుంజ ఆదిలక్ష్మి, పూనెం విజయలక్ష్మి, మడకం నాగమణి, కొడెo నరసమ్మ, ఏనిక మంగమ్మ, మునిగల శారద, సోలం రోజ, బొగ్గం శిరీష, పాయం నిరోషా, కారం మమత, జాతీయ ఆదివాసి గిరిజన అభ్యుదయ సంఘం నాయకులు భద్రాద్రి జిల్లా ప్రధాన కార్యదర్శి గొగ్గల ఆర్కే దొర పినపాక మండల అధ్యక్షులు కొమరం శ్రీను, పోలిశెట్టి హరీష్, కొమరం శేఖర్, బిల్లం సాంబశివరావు, జట్ల నరసింహారావు తదితరులు పాల్గొన్నారని తెలిపారు.