calender_icon.png 29 January, 2025 | 5:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింగరేణిలో స్ట్రక్చర్ సమావేశాలను పునరుద్ధరించాం..

27-01-2025 08:31:52 PM

ఏఐటియుసి బ్రాంచ్ సెక్రటరీ రాంగోపాల్...

మణుగూరు (విజయక్రాంతి): సింగరేణి సంస్థలో గత కొన్నేళ్లుగా నిలిచిపోయిన స్ట్రక్చర్ సమావేశాలను పునరుద్ధరించామనీ ఏఐటియుసి మణుగూరు బ్రాంచ్ సెక్రటరీ వై రాంగోపాల్ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఏరియా జిఎం కార్యాలయం వద్ద సోమవారం జరిగిన గేట్ మీటింగ్ లో ఆయన మాట్లాడారు. ఈ స్ట్రక్చర్ సమావేశాలలో డిస్మిస్ అయిన jmet లను తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవడానికి యాజమాన్యం అంగీకరించిందన్నారు. సింగరేణి కార్మికుల పిల్లలకు వర్తింపజేస్తున్న మెరిట్ స్కాలర్షిప్ ను 2 వేల నుండి 8 వేల వరకు పెంచడానికి, కొత్త ఇన్సెంటివ్ విధానం అమలు, వేజ్ బోర్డులో లేని 11 రకాల అలవెన్సులను పెంచడానికి, క్యాడర్ స్కీమ్ అమలుతో పాటు తదితర అంశాలపై అంగీకారం కుదిరిందని తెలిపారు. 

మణుగూరు ఏరియా స్ట్రక్చర్ సమావేశంలో మహిళా కార్మికులకు సంబంధించి అన్ని గనులు, విభాగాల వద్ద రెస్ట్ షెల్టర్లు వాష్ రూములు ఏర్పాటు చేయాలని, పివి కాలనీలో అంతర్గత రోడ్లను నిర్మించాలని, మణుగూరు ఏరియాలో ఖాళీగా ఉన్న వేకెన్సీలను భర్తీ చేయాలని, వీధిలైట్లు సరి చేయాలని, ఏరియా హాస్పిటల్ లో గైనకాలజిస్ట్ సమస్య పరిష్కరించాలని కోరామని తెలిపారు, ఏఐటియుసి యూనియన్ బలోపేతానికి ఆర్థికంగా చందా రాసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు. సమావేశంలో బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ మల్లెల రామ నరసయ్య, ఆఫీస్ బేరర్ ఆవుల నాగరాజు, ఆదర్ల సురేందర్, ఆడేపు రాజశేఖర్, నాయకులు నరసింహారావు, శరత్, జావేద్ తదితరులు పాల్గొన్నారు.