calender_icon.png 20 March, 2025 | 3:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుర్తింపు, ప్రాతినిధ్యం సంఘాలతో స్ట్రక్చర్ కమిటీ సమావేశం..

19-03-2025 10:35:48 PM

ఏరియా జిఎం షాలెం రాజు...

కొత్తగూడెం (విజయక్రాంతి): కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నందు, గుర్తింపు, ప్రాతినిధ్య సంఘం సభ్యులతో, స్ట్రక్చర్ కమిటీ సమావేశాలు వేరుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ఏరియా జనరల్ మేనేజర్ ఎం. షాలేం రాజు పాల్గొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన ఉత్పత్తి ఉత్పాదకత లక్ష్యాలను రక్షణతో సాధించడంలో, తమ వంతు సహాయం అందిస్తున్న గుర్తింపు, ప్రాతినిధ్య సంఘ సభ్యులకు అభినందనలు తెలియజేశారు.

స్ట్రక్చర్ కమిటీ సభ్యులు అందజేసిన డిమాండ్లను జిఎం, కమిటీ సంబంధిత అధికారులతో చర్చించి, వారి డిమాండ్ల సాధ్య సాధ్యలను, పరిశీలించి, పరిష్కరించదగిన డిమాండ్లను వీలైనంత తొందరగా పూర్తి చేయాలని, సంబంధిత అధికారులను ఆదేశించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిఎంతో పాటు గుర్తింపు సంఘం ఏఐటీయూసీ, ప్రాతినిధ్య సంఘం ఐఎన్టియుసి స్ట్రక్చర్ కమిటీలు, యాజమాన్య ప్రతినిధులు, ఏరియా స్టోర్స్ ఎగ్జిక్యూటివ్స్ పాల్గొన్నారు.