07-03-2025 03:32:32 PM
తెలంగాణ మాదిగ సంఘాల మహాకూటమి రాష్ట్ర చైర్మన్ క్రాంతి కార్
పోకల కిరణ్ కుమార్..
ముషీరాబాద్,(విజయక్రాంతి): మాజీ మంత్రి జానారెడ్డి(Former Minister Jana Reddy)పై ఎమ్మెల్సీ చింతపండు నవీన్, అలియాస్ (Teenmar Mallanna) చేసిన వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ మాదిగ సంఘాల మహాకూటమి రాష్ట్ర చైర్మన్ క్రాంతి కార్ కోకల కిరణ్ కుమార్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ మాదిగ సంఘాల మహా కూటమి రాష్ట్ర చైర్మన్ క్రాంతి కార్ పోకల కిరణ్ మాదిగ మాట్లాడుతూ తెలంగాణ జాతిపిత,తెలంగాణ ఆత్మ బంధువు, సీనియర్ నేత,మాజీ మంత్రి కుందురు జానారెడ్డి పై చింతపండు నవీన్ అలియాస్ (తీన్మార్ మల్లన్న) వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.జానారెడ్డి పేద దళిత గిరిజన బడుగు బలహీన వర్గాల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు నిగర్వి, సుదీర్ఘ తన రాజకీయ జీవితంలో ఎలాంటి మచ్చలేని మకుటంలేని మహా మనిష అని అన్నారు.
కులం, మతం ,వర్గం అంటూ లేని తెలంగాణ సాధకుడు జానారెడ్డి అని, ఇలాంటి విలువలు కలిగిన వ్యక్తి పట్ల స్థాయికి మించి మాట్లాడితే మంచిదన్నారు. నీకు దమ్ముంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించు అంతేకాని జానారెడ్డి జోలికి వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. నల్లగొండ జిల్లాలో ప్రతి మాదిగ పల్లెను అడుగు జానయ్య మాదిగ అని,ప్రతి మాల పల్లెను అడుగు జానయ్య మాల అని,ప్రతి తండాను అడుగు జాను నాయక్ అని,జాన య్య గౌడ్ అని,జానయ్య యాదవ్ అని,జానయ్య ముదిరాజ్ అని ఇలా సబ్బండ వర్గాల ఆరాధ్యుడిగా ఉన్న జానారెడ్డి కుల గణన విషయంలో కుట్రలు చేస్తున్నారని విమర్శించే అర్హత చింతపండు నవీన్ కు లేదన్నారు.నీ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు ఎలా బుద్ధి చెప్పాలో మాకు బాగా తెలుసునని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాల జేఏసీ చైర్మన్ గొల్లపల్లి దయానంద రావు గారు పాల్గొన్నారు.