- శతకంతో మెరిసిన యువ ప్లేయర్
- సెంచరీ దిశగా ములాని
- దులీప్ ట్రోఫీ
అనంతపురం: టీమిండియా యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ జాతీయ జట్టులోకి తిరిగి ఎంట్రీ ఇచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. తన ఫామ్‌ను కంటిన్యూ చేస్తూ ఇషాన్ దేశవాలీ టోర్నీ దులీప్ ట్రోఫీలో సెంచరీతో కదం తొక్కాడు. ఇటీవలే బుచ్చిబాబు టోర్నీలోనూ ఇషాన్ శతకంతో చెలరేగిన సంగతి తెలిసిందే. ఆ ప్రదర్శన మరువకముందే తాజాగా దులీప్‌లోనూ ఇషాన్ అదరగొట్టా డు. గురువారం అనంతపురం వేదికగా ఇండియాెేబితో మొదలైన మ్యాచ్‌లో ఇండియా తొలిరోజే పట్టు బిగించింది.
తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా జట్టు 79 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (126 బంతుల్లో 111; 14 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీతో చెలరేగాడు. బాబా ఇంద్రజిత్ (78) ఇషాన్‌కు సహకరించి జట్టు భారీ స్కోరు చేయడంలో తన వంతు పాత్ర పోషించాడు. అంతకముందు సాయి సుదర్శన్ (43), రజత్ పాటిదార్ (40) రాణించారు. ఇక 4 పరుగుల వద్ద రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన రుతురాజ్ తిరిగి బ్యాటింగ్‌కు వచ్చి 46 పరుగులతో అజేయంగా కొనసాగుతున్నాడు. మనవ్ సుతార్ (8*) క్రీజులో ఉన్నాడు.
ఇండియాబి బౌలింగ్‌లో ముకేశ్ కుమార్ 3 వికెట్లు తీయగా.. రాహుల్ చహర్, నవదీప్ సైనీ చెరొక వికెట్ తీశారు. తన ప్రవర్తనతో ఇటీవలే జాతీయ జట్టులో చోటు కోల్పోయిన ఇషాన్ సెంట్రల్ కాంట్రాక్ట్‌కు దూరమయ్యాడు. అయితే గజ్జల్లో గాయం కారణంగా తొలి రౌండ్ మ్యాచ్‌లకు దూరమైన ఇషాన్ పాత శైలిని గుర్తుకు తెస్తూ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మరో రెండు మూడు ఇన్నింగ్స్‌ల పాటు ఇషాన్ ఇదే నిలకడను కొనసాగిస్తే జాతీయ జట్టులోకి మళ్లీ పిలుపు వచ్చే అవకాశముంటుంది.
ఆకట్టుకున్న ములాని..
ఇక ఇండియా జరుగుతున్న మ్యాచ్‌లో ఇండియా జట్టు తొలి రోజు ఆధిక్యం ప్రదర్శించింది. తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఇండియా జట్టు 8 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. శామ్స్ ములాని (174 బంతుల్లో 88 నాటౌట్) సెంచరీ దిశగా పయనిస్తున్నాడు. తనుశ్ కొటియన్ (53) అర్థసెంచరీతో రాణించాడు. ఇండియా బౌలర్లలో అర్షదీప్, హర్షిత్ , విధ్వాత్‌లు తలా రెండు వికెట్లు పడగొట్టారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇండియా ఆరంభం నుంచే ఎదురుదాడికి దిగింది. కట్టుదిట్టమైన బౌలింగ్‌కు ఇండియా జట్టు 93 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడింది.
ఈ దశలో క్రీజులో కి వచ్చిన ములాని ఆకట్టుకున్నాడు. ప్రధాన బ్యాటర్లంతా విఫలమైన చోట తాను మాత్రం నిలకడగా ఆడి ఇన్నింగ్స్ నడిపించాడు. తనుశ్ కొటియన్‌తో కలిసి ఏడో వికెట్‌కు 91 పరుగులు జోడించాడు. ఇద్దరు అర్థసెంచరీతో మెరవడంతో ఇండియా కోలుకున్నట్లే అనిపించింది. కానీ చివర్లో ఇండియా బౌలర్లు మరోసారి చెలరేగి వికెట్లు పడగొట్టారు. అయితే ములాని అజేయంగా నిలవడం ఇండియాెేఏ జట్టుకు సానుకూలాంశం.