- ఎస్పీ శరత్‌చంద్ర పవార్
- 5.65 క్వింటాళ్ల గంజాయి కాల్చివేత
నల్లగొండ, ఆగస్టు 13 (విజయక్రాంతి): జిల్లాలో గంజాయి నిర్మూలనకు పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ శరత్‌చంద్ర పవార్ అన్నారు. జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో పట్టుబడిన 5.65 క్వింటాళ్ల గంజాయిని కోర్టు ఆదేశాల మేరకు మంగళవారం నల్లగొండ ఫైరింగ్ రేంజ్ ఆవరణలో పోలీసు లు కాల్చివేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మా ట్లాడుతూ.. నల్లగొండను మాదకద్రవ్య రహితంగా చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నామని తెలిపారు. జిల్లాలో 43 కేసుల్లో 5.65 క్వింటాళ్ల గంజాయి పట్టుబడినట్లు వెల్లడించారు.