10-04-2025 12:00:00 AM
కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే
కుమ్రం భీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 9(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోదాములో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల భద్రత కొరకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. బుధవారం నెల వారి తనిఖీలు భాగంగా జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోదాము, రక్షణ చర్యలను పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాట్లాడుతూ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల గోదాము వద్ద పటి ష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసి సీసీ కెమెరాల ద్వారా 24 గంటలపాటు పర్యవేక్షించ డం జరుగుతుందని తెలిపారు. బందోబస్తు విధులు నిర్వహిస్తున్న సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల విభాగం పర్యవేక్షకు లు సునీల్, నాయక్ తహసీల్దార్ శ్యామ్ లాల్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.