20-03-2025 08:00:36 PM
ఆర్కే గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ సిఈఓ ఎం జైపాల్ రెడ్డి..
కామారెడ్డి (విజయక్రాంతి): బాల్యంలోనే విద్యార్థులకు బలమైన విద్య పునాదులు వేయడం ఎంతో ముఖ్యమని తల్లిదండ్రులు పిల్లల ఆసక్తిని పెంచేలా ప్రోత్సహించాలని ఆర్కే గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ సీఈవో ఎం జైపాల్ రెడ్డి అన్నారు. గురువారం కామారెడ్డి ఆర్కిడ్స్ హైస్కూల్లో యూకేజీ గ్రాడ్యుయేషన్ డే ను ఎంతో ఉత్సాహంగా నిర్వహించారు. విద్యార్థుల తల్లిదండ్రులను పిలిచి వారి సమక్షంలో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం చిన్నారుల విద్య ప్రయాణంలో ఇది ఒక ముఖ్యమైన ఘట్టం కావడంతో వారి విజయాలను తల్లిదండ్రులు అధ్యాపకులు గౌరవ అతిథులు కలిసి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధానాకర్షణగా నిలిచింది పిల్లలు వ్యాజినేషన్ గౌన్లు ధరించి సర్టిఫికెట్లు తల్లిదండ్రులతో కలిసి అందుకున్నారు.
పాఠశాల ప్రిన్సిపల్ గోవర్ధన్ రెడ్డి ఉపన్యాసంలో ఉపాధ్యాయులు విద్యార్థులకు అందిస్తున్న నాణ్యమైన విద్య బోధనలను వివరించారు పాఠశాల డైరెక్టర్ మొదటి సదాశివరెడ్డి విద్యా ప్రమాణాలు మెరుగుపరిచే విధానాల గురించి వివరించారు. విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ.. తమ పిల్లల అభివృద్ధిని చూసి మేమంతా ఆనందిస్తున్నామని విద్యార్థులకు గొప్ప భవిష్యత్తు అందించేందుకు ఆర్చి పాఠశాల యజమాన్యం నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ మర్రి భూలక్ష్మి, పాఠశాల అకాడమీకి ఇంచార్జ్ వసంత, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు విద్యార్థులు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.