calender_icon.png 16 November, 2024 | 6:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రూప్-3 పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు

16-11-2024 03:35:18 PM

పరిసరాల్లో 144 సెక్షన్ అమలు

నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): గ్రూప్-III పరీక్షా కేంద్రాల వద్ద అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు శాఖ పటిష్ట భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్  తెలిపారు. నల్గొండ పట్టణంలో 60 పరీక్షా కేంద్రాలు, మిర్యాలగూడ పట్టణంలో 28, మొత్తం 88 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు, మొత్తం 28,353 మంది అభ్యర్థులు పరీక్షలు రాస్తున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు.

పరీక్ష కేంద్రాల సమీపంలో జిరాక్స్ సెంటర్స్, ఇంటర్నెట్ సెంటర్స్, చుట్టుపక్కల లౌడ్ స్పీకర్లు, మూసి వేయాలని, 500 మీటర్ల వరకు ప్రజలు గుమిగూడ వద్దని సూచించారు. అభ్యర్థులు సమయానికి పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని అన్నారు. అభ్యర్థులు సెల్ ఫోన్లు, ట్యాబ్, పెన్ డ్రైవ్, బ్లూటూత్, ఎలక్ట్రానిక్ వాచ్, కాలిక్యులేటర్లు తీసుకువెళ్లడానికి అనుమతి ఉండదని చెప్పారు. పరీక్ష కేంద్రంలోకి వెళ్లేముందే తనిఖీలు నిర్వహించే పోలీసులకు సహకరించాలని కోరారు.