రాష్ట్ర ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
ముషీరాబాద్, జనవరి 12 : స్వామి వివేకానందుడి ఆశయ సాధనకు కృషి చేస్తామని రాష్ట్ర ఐటీ, శాసనసభ వ్యవహారాల శాఖా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని హైదరాబాద్ లోయర్ ట్యాంక్‌బండ్‌లోని దోమలగూడలో గల రామకృష్ణమఠంలో జరిగిన జాతీయ యువజన దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా రామకృష్ణ మఠంలో ఏర్పాటు చేసిన పద్దెనిమిదిన్నర అడుగుల స్వామి వివేకానంద విగ్రహాన్ని హైదరాబాద్ రామకృష్ణ మఠం అధ్యక్షుడు స్వామి బోధమయానంద, ఇతర స్వామీజీలతో కలిసి మంత్రి ఆవిష్కరించారు. తుగ్లక్ మ్యాగజిన్ ఎడిటర్, చార్టెడ్ అకౌంటెంట్ గురుమూర్తి పాల్గొన్నారు.