calender_icon.png 19 April, 2025 | 7:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి

15-04-2025 01:39:59 AM

జయంసందర్భంగా జిల్లాలో ఘన నివాళి 

మేడ్చల్, ఏప్రిల్ 14(విజయ క్రాంతి): భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వక్తలు అభిప్రాయపడ్డారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా మేడ్చ ల్ మల్కాజిగిరి జిల్లాలో వివిధ పార్టీల నాయకులు, దళిత సంఘాల నాయకులు, అధికా రులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చేసిన సేవలను కొనియా డారు. అల్వాల్ లోని వెంకటాపూర్ లో షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ప్రభు త్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.

కులాంతర వివాహాలు చేసుకున్న జంటలకు మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహక చెక్కులను అందజే శారు. దళితుల అభ్యున్నతికి కృషి చేసిన వారికి దళిత రత్న అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక సారథి అధ్యక్షురాలు ఉమ్మడి వెన్నెల ప్రసంగించా రు. డిసిపి కోటిరెడ్డి, కార్పొరేటర్లు సవిత అని ల్, జితేంద్ర నాథ్, శాంతి శ్రీనివాసరెడ్డి, ప్రే మ్ కుమార్, ఆర్డీవో శ్యాం ప్రసాద్, డి ఎస్ డబ్ల్యు వినోద్, ఏఎస్ డబ్ల్యు పాండు తదితరులు పాల్గొన్నారు. 

పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ కీసర, ఈసీఐఎల్, సూరా రం లోని శివాలయ నగర్ తదితర ప్రాంతా ల్లో అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఎంపీ వెంట మేడ్చల్ అర్బన్ జిల్లా ఇన్చార్జి మల్లారెడ్డి, ప్రధాన కార్యదర్శి గిరి వర్ధన్ రెడ్డి, భరత సింహారెడ్డి పాల్గొన్నారు. నేరేడ్మెట్ లోని పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సి పి సుధీర్ బాబు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. మాజీమంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చా మకూర మల్లారెడ్డి బోయిన్పల్లి, బోడుప్పల్, కీసర తదితర ప్రాంతాల్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు హరి వర్ధన్ రెడ్డి, మేడ్చల్ ఇన్చార్జి వజ్రాష్ యాదవ్, కూకట్పల్లిలో జనసేన ఇన్చార్జి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్, గాజులరామారంలో మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, కీసర, ఘట్కేసర్ లో బిజెపి నాయకుడు ఏనుగు సుదర్శ న్ రెడ్డి, మేడ్చల్ లో బిజెపి నాయకుడు పాతూరి సుధాకర్ రెడ్డి తదితరులు నివాళులర్పించారు.

స్ఫూర్తి ప్రధాత అంబేద్కర్....

 రంగారెడ్డి,ఏప్రిల్ 14 (విజయక్రాంతి ): అణగారి ప్రజల హక్కుల కోసం తన జీవితాన్నే  త్యజించిన ఆశాజ్యోతి స్ఫూర్తి ప్రధాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని వక్తలు పేర్కొన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా వ్యా ప్తంగా అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనం గా జరుపుకున్నారు. పల్లె,పట్టణం తేడా లే కుండా అంబేద్కర్ విగ్రహాలు, చిత్రపటాలకు నేతలు, అధికారులు, బహుజన సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వేడుకలను పురస్కరించుకొని  అంబేద్కర్ యువజన సంఘాల ఆధ్వర్యం లో ఘనంగా ర్యాలీ నిర్వహించి... జై భీమ్ ని నాదాలతో  హోరోత్తించారు. 

షాద్నగర్, చేవెళ్ల, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేర్లింగంపల్లి, ఇబ్రహీంపట్నం, ఎల్బీనగర్, కల్వకుర్తి  (ఆమనగల్ బ్లాక్ మండలాల్లో ) ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి, వీర్లపల్లి శంక ర్, కాలే యాదయ్య, ప్రకాష్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, దేవి రెడ్డి సుధీర్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, అరికెపూడి గాంధీ తో పాటు బిఆర్‌ఎస్, బిజెపి, బీఎస్పీ, సిపిఎం, సిపిఐ, టిడిపి వివిధ పార్టీలకు చెందిన నేతలు  వేడుకల్లో పాల్గొని అంబేద్కర్ కు ఘనంగా నివా ళులర్పించారు.ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ అంబేద్కర్ అందరి వాడని వారు కొనియాడారు. అంబేద్కర్ ఆశయాల ను నెరవేర్చేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని వారు పిలుపునిచ్చారు.