calender_icon.png 7 March, 2025 | 11:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెరుగైన ఫలితాల సాధనకు కృషి చేయాలి

07-03-2025 01:26:58 AM

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల, మార్చి 6 (విజయక్రాంతి ) : కేంద్రీయ విద్యాలయంలో వార్షిక పరీక్షలలో మెరుగైన ఫలితాల సాధన దిశగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం జిల్లాలోని హాజీపూర్ మండలం గుడిపేటలో కొనసాగుతున్న కేంద్రీయ విద్యాలయ భవన నిర్మాణ పనులను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్రీయ విద్యాలయం ద్వారా మెరుగైన విద్య అందించేందుకు కృషి చేస్తామన్నారు.

కేంద్రీయ విద్యాలయానికి స్వంత భవనాన్ని కేటాయించి మరింత మెరుగైన సదుపాయాలతో విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విద్యాలయంలో విద్యనభ్య సిస్తున్న విద్యార్థులు క్రీడా రంగంలో జాతీయ స్థాయిలో రాణిస్తున్నారని, వీరిని మరింత ప్రోత్సహించి అంతర్జాతీ య స్థాయి పోటీలలో పాల్గొనేలా కృషి చేయాలని తెలిపారు.

నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేసే విధంగా అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు. స్కిల్ డెపలప్మెంట్ కేంద్రం ఏర్పాటు కొరకు మండల తహశిల్దార్ శ్రీనివాసరావు దేశ్పాండేతో కలిసి స్థలాన్ని పరిశీలించారు. అనంతరం తహశిల్దార్ కార్యాలయాన్ని సందర్శించి రిజిస్టర్లు, రికార్డులు పరిశీలించారు.

వివిధ రకాల భూ సమస్యలపై వచ్చే దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని, ధృవపత్రాల కొరకు అందిన దరఖాస్తులను నిబంధనలకు లోబడి పరిశీలించి నిర్ణీత గడువులోగా జారీ చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.