పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లుగా ప్రజల పరిస్థితి
విదేశీయులు ఇండియాలో పర్యటించేలా ఎన్‌ఆర్‌ఐలు కృషి చేయాలి
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌సమగ్ర కుటుంబ సర్వే నివేదిక ఏమైంది?
కేంద్ర మంత్రి బండి సంజయ్
కరీంనగర్, నవంబర్ 4 (విజయక్రాంతి): రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బరితెగించి పాలన చేస్తోందని, ఆలయాలను ధ్వంసం చేస్తున్నా పట్టించుకోవడం లేదని, హామీలను అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ విమర్శించారు. సోమవారం కరీంనగర్‌లోని తన కార్యాలయం నుంచి ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ అసోసియేషన్‌కు చెందిన ఎన్నారైలతో బండి సంజయ్ జూమ్ ద్వారా సంభాషించారు. విదేశాల్లో స్థిరపడ్డ ఎన్నారైలంతా భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలని కోరారు.
ప్రతి ఎన్నారై తనవంతుగా కనీసం ఐదుగురు విదేశీ కుటుంబాలను భారత్‌లో పర్యటించేలా చేసి, భారతీయ పర్యాటక రంగం అభివృద్ధికి పాటుపడాలని బండి సంజయ్ కోరారు. కాగా హైడ్రా, మూసీ పునరుజ్జీవం, కుల గణన పేరుతో మీడియాలో ప్రచారం చేసుకుంటూ 6 గ్యారంటీలను కాంగ్రెస్ దాటవేస్తోందని మండిపడ్డారు. సీఎం ఇస్తున్న హామీలకు, చెబుతున్న మాటలకు విలువ లేకుండా పోయిందని విమర్శించారు. కేసీఆర్ కుటుంబ, నియంత, అవినీతి పాలనతో విసిగిపోయి మార్పు కోసం కాంగ్రెస్‌కు ఓటేసిన ప్రజల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లయిందన్నారు.
2028లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు తథ్యమని ఉద్ఘాటించారు. నెల రోజులుగా వడ్లను రోడ్లపై పోసి ఎదురుచూస్తున్నా కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో రైతులు అరిగోస పడుతున్నారని అన్నారు. జాతీయవాద వ్యతిరేక భావజాలమున్న వాళ్లను, నక్సలైట్ సానుభూతి పరులతో విద్యా కమిషన్ ఏర్పాటు చేశారని, వీరంతా దేశ చరిత్రను, వివేకానంద స్వామి, శివాజీ, వీరసావర్కర్ చరిత్రను కనుమరుగు చేయాలనుకునేవాళ్లేనని విమర్శించారు.
బీజేపీ అధికారంలోకి వస్తే దేవాలయాలను ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వ ప్రమేయం లేకుండా తీర్చిదిద్దుతామని, ఆదాయం కోసం కాకుం డా హిందూ ధర్మం పెంపొందేలా సేవలందిస్తామని బండి సంజయ్ అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి జయశ్రీ, అసోసియేషన్ ప్రతినిధులు పవన్, కృష్ణారెడ్డి, విలాస్, నిర్మలారెడ్డి పాల్గొన్నారు.
ఫిల్టర్ బెడ్ పనులకు శంకుస్థాపన
కరీంనగర్‌లోని సిరిసిల్ల బైపాస్ రోడ్డు సమీపంలో విలీన గ్రామాల కోసం అమృత్ స్కీం కింద ఫిల్టర్ బెడ్ పనులకు ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ సునీల్‌రావు, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డిలతో కలిసి బండి సంజయ్ శంకుస్థాపన చేశారు. రాష్ట్రానికి అమృత్ 2 కింద రూ.6,876 కోట్లను కేటాయిస్తున్నట్లు యన తెలిపారు.
సిరిసిల్ల, నవంబర్ 4 (విజయక్రాంతి): కేసీఆర్ హయాంలో నిర్వహించిన సమ గ్ర కుటుంబ సర్వే నివేదిక ఏమైందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ ప్రశ్నించారు. ఆ సర్వే ను కాంగ్రెస్ బయటపెట్టకుండా మళ్లీ కులగణన పేరుతో హడావిడి ఎందుకు అని ప్రశ్నించారు. సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మం డలంలోని వరదవెల్లి గ్రామం వద్ద మిడ్ మానేరులో బోటు సేవలను కలెక్టర్ సం దీప్‌కుమార్ ఝాతో కలిసి ప్రారంభించా రు.
బోట్‌లో మిడ్ మానేర్‌లోని గుట్టపై ఉన్న దత్తాత్రేయ స్వామి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ హ యాంలో వందల కోట్లు ఖర్చు పెట్టి చేసి న సర్వే నివేదికను ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు. ఆ వివరాలు లేకపోతే దానికోసం ఖర్చు పెట్టిన సొ మ్మును కేసీఆర్ కుటుంబం నుంచి రికవరీ చేయించే దమ్ము కాంగ్రెస్‌కు ఉందా అని బండి సంజయ్ సవాల్ చేశారు.