calender_icon.png 25 October, 2024 | 10:53 AM

కులగణనపై సీఎం స్పందించేదాకా దీక్ష చేస్తం

29-08-2024 12:00:00 AM

బీసీ సంఘాల హెచ్చరిక

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 28(విజయక్రాంతి): బీసీ కులగణనపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించేవరకు ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తామని బీసీ సంఘాల నాయకులు హెచ్చరించారు. కులగణన చేపట్టి, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ ఆజాదీ యూత్ ఫెడరేషన్ అధ్యక్షుడు జక్కని సంజయ్‌కుమార్, హిందూ బీసీ మహాసభ అధ్య క్షుడు బత్తుల సిద్ధేశ్వర్ చేపట్టిన నిరాహార దీక్ష బుధవారం నాలుగోరోజుకు చేరుకుంది.

మంగళవారం రాత్రి పోలీసులు వారిని గాంధీ ఆసుపత్రిలో చేర్పించినప్పటికీ దీక్షను కొనసాగిస్తు న్నారు. వారిని బీసీ సంఘం నేతలు జాజుల శ్రీనివాస్‌గౌడ్, రాజారాంయాదవ్ పరామర్శించారు. బీసీ సంఘాల నేతలు చేస్తున్న దీక్ష కు మద్దతుగా ఓయూ ఆర్ట్స్ కాలేజీ ఎదుట బుధవారం నిరసన తెలిపారు. బీసీ నేతలకు ఏదైనా జరిగితే ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత అని బీసీ ఆజాదీ యూత్ అధికార ప్రతినిధి అభిలాష్‌గౌడ్ అన్నారు. కార్యక్రమంలో నాయకులు అజయ్, వెంకటేష్ పాల్గొన్నారు.