calender_icon.png 5 February, 2025 | 4:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎల్‌ఐసీ సంస్థలో విదేశీ పెట్టుబడులను ఉపసంహరించుకోవాలని సమ్మె

05-02-2025 12:55:14 AM

సూర్యాపేట, ఫిబ్రవరి 4: ఎల్‌ఐసి సంస్థలో విదేశీ పెట్టుబడులను, బీమా ప్రీమియంపై జీఎస్టీని ఎత్తివేయాలని మంగళవారం ఎల్‌ఐసి ఉద్యోగులు, ఏజెంట్లు ఎల్‌ఐసి శాఖ సూర్యాపేటలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో సమ్మె చేశారు.  ఈ సందర్బంగా సమ్మె ను ఉద్దేశించి  ఐసిఇ. యు సెక్రటరీ సూర్యాపేట డి. ప్రభాకర్ మాట్లాడుతూ ఎల్‌ఐసి సంస్థలో విదేశీ పెట్టుబడులను ఉపసంహరించుకోవడమే కాకుండా, బీమా ప్రీమియంపై జిఎస్టిని తీసివే యాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు చాంద్ పాషా, నరేష్ కుమార్, ఎల్లేష్ కుమార్, యాదయ్య, పాపయ్య, రమేష్, సంజీవయ్య,శంకర్ తదితరులు పాల్గొన్నారు.