calender_icon.png 24 February, 2025 | 11:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికల కోడ్‌కు ముందే సమ్మె నోటీసు

13-02-2025 02:03:30 AM

ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న

హైదరాబాద్, ఫిబ్రవరి 12 (విజయక్రాంతి): ఈ ఏడాది జనవరి 27న తాము సమ్మె నోటీసు ఇచ్చామని, అప్పుడు ఎన్నికల కోడ్ రాలేదని, ఇది ఎన్నికల కోడ్ పరిధిలోకి ఎలా వస్తుందని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న ప్రశ్నించారు. ఫిబ్రవరి 3న కోడ్ వస్తే దానికి సమ్మెతో ముడిపెట్టడం కరెక్ట్ కాదని అన్నారు. సమ్మె నివారణ కోసం ఎన్నికల కమిషన్ అనుమతి కోరాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు కార్మిక శాఖ ఈనెల 10న త మను ఎలా చర్చలకు పిలిచిందని ప్రశ్నించారు.