calender_icon.png 29 April, 2025 | 2:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

9వ రోజుకు చేరిన సమ్మె

28-04-2025 12:27:46 AM

  1. వివిధ వర్సిటీల్లో కొనసాగిన కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల నిరసనలు
  2. తమ ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలని డిమాండ్

హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 27(విజయక్రాంతి): తమ ఉద్యోగాలను రెగ్యులర్ చే యాలని కోరుతూ రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల్లో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు చేస్తున్న సమ్మె తొమ్మిదోరోజుకు చేరింది. ఆదివారం ఉస్మానియా యూనివర్సిటీ పరిపాలన భవనం ఎదుట కాంట్రాక్ట్ అధ్యాపకులు నిరసన తెలిపారు.  పలువురు అధ్యాపకులు ఎమ్మెల్సీ కోదండరాంను కలిసి వినతిపత్రం సమర్పించారు.

తమ సమస్య గురించి ప్రభుత్వానికి తెలపాలని కోరారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని కోదండరాం హామీ ఇచ్చినట్టు వారు తెలిపారు. సమ్మె సందర్భంగా కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘం నాయకులు డాక్టర్ ధర్మతేజ, తదితరులు మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం అని ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ చెబుతున్నారని, ఆ ప్రకారమే తమ ఉద్యోగాలను క్రమబద్ధం చేయాలని కోరారు.

రెగ్యులర్ చేసేందుకు సమయం పడుతుందని ప్రభుత్వం భావిస్తే యూజీసీ బేసిక్ పే స్కేల్, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశా రు. కాకతీయ యూనివర్సిటీ పరిపాలన భవ నం ఎదుట జరిగిన నిరసనలో కాంట్రాక్ట్ అ ధ్యాపకుల సంఘం నాయకులు డాక్టర్ శ్రీధర్ లోథ్, డాక్టర్ సాదు రాజేశ్ తదితరులు మా ట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వివిధ యూనివర్సిటీల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలోని జేఎన్‌టీయూహెచ్, శాతవాహన, తెలం గాణ, మహత్మాగాంధీ, తదితర యూనివర్సిటీ ల్లో నిరసనలు కొనసాగాయి. కార్యక్రమాల్లో డాక్టర్ పరుశురాం, డా.కుమార్, డా.ఉపేందర్, డా.విజేందర్‌రెడ్డి, డా.తాళ్లపల్లి వెంకటేశ్వర్లు, డా.కృష్ణయ్య, డా.తిరుపతి, డా.సతీశ్, డా.జూల సత్య, డా.సూర్యనారాయణ, డా.భాగ్య, డా. సునీత, డా.భాగ్య తదితరులు పాల్గొన్నారు.