15-03-2025 12:00:00 AM
సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు దుర్గం దినకర్
కుమ్రం భీం ఆసిఫాబాద్, మార్చి 14(విజయ క్రాంతి): ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న వర్కర్స్ వేతనాలు చెల్లించాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు దుర్గం దినకర్ డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సిఐటియు ఆధ్వర్యంలో చేపడుతున్న సమ్మె శుక్రవారం కి మూడో రోజుకు చేరుకుంది. పండగ పూట కూడా కార్మికులు సమ్మెబాట ను విడవలేదు. శిబిరాన్ని సందర్శించిన దినకర్ మాట్లాడుతూ ఏడు నెలలుగా వేతనాలు రాకుంటే కార్మికులు వారి కుటుంబాలు ఎలా బ్రతకాలని ప్రశ్నించారు.
అన్ని వర్గాల వారు పండగలు జరుపుకుంటే మీరు పస్తులు ఉండాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ గెజిట్ ప్రకారం వేతనాలు చెల్లించాలని,ఈఎస్‌ఐ ,పిఎఫ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు చెల్లించడంతో పాటు ఐదు సంవత్సరాల సర్వీస్ ఉన్నవారిని పర్మినెంట్ చేయాలని, కార్మిక కుటుంబాల లో వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షుడు రాజేందర్, రాష్ట్ర నాయకుడు కృష్ణమాచారి తదితరులు పాల్గొన్నారు.