31-03-2025 12:00:00 AM
-పోలీసు అధికారులతో టెలికాంట్స్‌లో మాట్లాడిన జిల్లా ఎస్పీ డి జానకి
మహబూబ్ నగర్ మార్చి 30 (విజయ క్రాంతి) : రంజాన్ పండుగను పురస్కరించుకొని ఈద్గాల వద్ద భద్రతా ఏర్పాట్లను పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా ఎస్పీ డి జానకి పోలీస్ అధికారులను ఆదేశించారు. ఆదివారం జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి పోలీసు అధికారులతో టెలి కాన్ఫరెన్స్ లో రంజాన్ పండుగ ఏర్పాట్లపై మాట్లాడారు.
శాంతి భద్రతలను కాపాడేందుకు తీసుకోవాల్సిన చర్యలను అధికారులకు సూచించారు.ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా పోలీసులు 24 గంటలపాటు విధుల్లో ఉండాలని చెప్పారు. సీసీటీవీ కెమెరాలతో పర్యవేక్షణ, క్యూఆర్టీ (క్విక్ రియాక్షన్ టీమ్స్), మున్సిపల్ మరియు రెవెన్యూ అధికారులతో సమన్వయం ఏర్పాటు చేసినట్లు వివరించారు. రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకోవాలని, ఈ సందర్భంగా ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు జిల్లా ఎస్పీ డి జానకి తెలియజేశారు.