calender_icon.png 24 January, 2025 | 11:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించాలి...

24-01-2025 04:25:06 PM

మణుగూరు SDPO రవీందర్ రెడ్డి...

మణుగూరు (విజయక్రాంతి): వాహన చోదకులు ఖచ్చితంగా ట్రాఫిక్ నిబంధనలకు అనుగుణంగా వాహనాలను నడపాలని మణుగూరు సబ్ డివిజనల్ పోలీస్ అధికారి రవీంద్రారెడ్డి అన్నారు. జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం పట్టణంలోని టీవీ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ద్విచక్ర వాహనదారులు తన, కుటుంబ సభ్యులను గుర్తుంచుకోని తప్పక హెల్మెట్ ను ధరించాలని సూచించారు. కార్లు లాంటి లైట్ మోటార్ వెహికల్ లను నడిపేవారు తప్పక సీట్ బెల్ట్ ధరించాలని అన్నారు. ట్రాఫిక్ నిబంధనాలను పాటించకపోయిన మద్యం తాగి వాహనాలను నడిపిన కఠినంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మణుగూరు సిఐ సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.