17-04-2025 01:47:35 AM
పోలీసు ప్రజా భరోసా కార్యక్రమాలతో ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి
దాతల సహాకారంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి
పెన్‌పహాడ్ పోలీస్ స్టేషన్ ఆకస్మిక తణిఖీలో సిబ్బందితో జిల్లా ఎస్పీ నరసింహా
పెన్ పహాడ్, ఏప్రిల్ 16 : ఇసుక, గంజాయి అక్రమ రవాణ రాష్ట్ర వ్యాప్తంగా రోజు రోజుకు పేట్రేగిపోకుండా పోలీసు సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించి నప్పుడే ఈలాంటి అక్రమ రవాణాకు చెక్ పెట్టవచ్చని సూర్యాపేట జిల్లా ఎస్సీ నరసింహా సిబ్బందికి సూచించారు. బుధవారం సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండల కేంద్రములోని పోలీస్ స్టేషన్ ను అకస్మిక తణిఖీ నిర్వహించి సిబ్బందితో ముఖాముఖీ మాట్లాడారు.
ఈసందర్భంగా స్టేషన్ రికార్డులను, పరిసరాలను, వివిధరకాల నేరాలలో స్వాధీనం చేసుకున్న వహనాలు, ఫిర్యాదుల నమోదు ప్రాథమిక ధర్యాప్తలపై ఆరా తీశారు. విధి నిర్వహణలో పోలీసు సిబ్బంది సమస్యలుంటే వెంటనే ఉన్నత అధికారులకు తెలియజేసి పరిస్కారం దిశగా ముందుకు వెళ్ళాలన్నారు. అంతేకాకుండా సిబ్బంది బాధ్యతయుతంగా విధులు నిర్వర్తిస్తూ డయల్ 100 ఫిర్యాధులు, స్టేషన్కు వచ్చే బాధితుల సమస్యలపై అండగా ఉంటూ పరిస్కార మార్గంలో బాధితులతో బేష్ అనిపిం చుకోవాలన్నారు.
గ్రామ పోలీసు అధికారి వ్యవస్థను పెంచుకోవడానికి మార్గంలో భాగంగా సమాచార వనరుల రూపొందించుకోవాలన్నారు. మండలంలో ఇసుక, గంజాయి అక్రమ రవాణ పటిష్టంగా నిరోదించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. గంజాయి కేసుల్లో ఉన్న నిందుతుల కదలికలపై ఆరా తీయాలన్నారు. జిల్లా పోలీసు శాఖ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ’పోలీసు-ప్ర జా భరోసా’ కార్యక్రమాలతో ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని సిబ్బందికి ఆదేశించారు.
ప్రజల్లో భద్రత పరమైన చైతన్యం తీసుకురావడానికి సిబ్బంది మేమున్నామంటూ భరోసా కల్పించేలా విధులు నిర్వ ర్తించాలన్నారు. గ్రామాలలో ప్రధాన కూడలిలో సీసీ కెమెరాల ఏర్పాటుకు గ్రామస్థుల సహకారం తీసుకోవాలని ఎస్‌ఐ గోపికృష్ణతోపాటు గ్రామ పోలీసు అధికారులకు సూచించారు. కార్యక్రమములో రూరల్ సీఐ రాజశేఖర్, ఎస్‌ఐ గోపికృష్ణ. ఏఎస్‌ఐ రాము లు, హెడ్ కానిస్టేబుల్స్ మురళిధర్ రెడ్డి, యాదగిరి, సిబ్బంది తదితరులు ఉన్నారు.