calender_icon.png 18 January, 2025 | 12:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తప్పవు

17-01-2025 06:18:03 PM

జిల్లా కలెక్టర్ పమేళ సత్పతి...

హుజురాబాద్ (విజయక్రాంతి): లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ పమేళ సత్పతి(District Collector Pamela Satpathy) హెచ్చరించారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం సింగపూర్ గ్రామంలో శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.... లింగ నిర్ధారణ పరీక్షలు, నిబంధనలకు విరుద్ధంగా అబార్షన్ లు చేస్తే చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించాలన్నారు. ఆటపాటలతో పాటు పూర్వ ప్రాథమిక విద్యను బోధిస్తున్నట్లు, చిన్నారులను అంగన్వాడి కేంద్రాలకు పంపించాలని సూచించారు. గర్భిణిగా నిర్ధారణ అయినప్పటినుండి మొదటి నెల రోజులు కీలకమని ఈ సమయంలో తీసుకున్న పౌష్టిక ఆహారంతో పుట్టిన చిన్నారులలో మానసిక, శారీరక ఎదుగుదల ఉంటుందని సూచించారు.

గర్భిణీ స్త్రీలు విధిగా నాలుగు ఏఎంసి చెకప్ లు, ఐదు నెలలు దాటిన తర్వాత బ్రేక్ఫాస్ట్ క్యాన్ చేయించుకోవాలని అన్నారు. చల్పూర్ సెక్టర్ పరిధిలో చిన్నారులు పోషకాహార లోపంతో ఉన్నారని వారి ఎత్తు, బరువు ఎప్పటికప్పుడు నమోదు చేయాలని ఐసిడిఎస్, ఆరోగ్యశాఖ అధికారులకు సూచించారు. అంగన్వాడీ కేంద్రంలో అందించే ఆహారం ఇంటికి తీసుకు వెళ్లొద్దని కేంద్రాల్లోనే తినాలని మహిళలకు సూచించారు. ఆరోగ్య మహిళా కింద 40 వేల విలువైన 54 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా అందిస్తున్నామని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు, పిల్లలకు అన్నప్రాసన చేశారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ జిల్లా అధికారిని సబిత, హుజురాబాద్ ఆర్టీవో రమేష్ బాబు, డిఎంహెచ్ఓ వెంకటరమణ, తాహసిల్దార్ కనకయ్య, ఎంపీడీవో సునీతతో పాటు తదితరులు పాల్గొన్నారు.