calender_icon.png 8 January, 2025 | 7:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చైనా మాంజ అమ్మితే కఠిన చర్యలు తప్పవు

07-01-2025 06:50:48 PM

హుజురాబాద్ పట్టణ సీఐ తిరుమల గౌడ్...

హుజురాబాద్ (విజయక్రాంతి): గాలిపటాల విక్రయదారులు చైనా మాంజా అమ్మితే కఠిన చర్యలు తప్పవని హుజురాబాద్ టౌన్ సిఐ తిరుమల్ గౌడ్ హెచ్చరించారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్  పట్టణంలో పలు కిరాణ జనరల్ స్టోర్స్ మంగళవారం తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సంక్రాంతి పండుగ సమీపిస్తుండడంతో చాలామంది గాలిపటాలను ఎగరవేయడం ఆనవాయితీగా వస్తుండడంతో ముందస్తుగా తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. చైనా మాంజలు ఉపయోగించడం వల్ల చాలా ప్రమాదాలు జరుగుతాయన్నారు. కొన్ని సందర్భాల్లో మాంజాతో ప్రజలతో పాటు పక్షుల ప్రాణానికి కూడా ముప్పువాటిల్లే ప్రమాదం ఉందన్నారు. ముఖ్యంగా గాలిపటాలు ఎగరవేసే సమయంలో పక్షులు గాలిపటం సమీపంలోకి వచ్చినప్పుడు మాంజాలు వాటికి తాకి మరణించిన సందర్భాలు ఉన్నాయని, ఇలాంటి ప్రమాదకరమైన మాంజాను హుజురాబాద్ లో అమ్మకం చేస్తే వారిపై కేసు నమోదు చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని  హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై యునస్ అహ్మద్ అలీ తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.