calender_icon.png 27 December, 2024 | 1:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గంజాయి నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలి

04-09-2024 11:58:36 AM

అనుమనితులకు టెస్టులు నిర్వహించాలని

పోలీసులకు మునుగోడు శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ఆదేశం

నల్లగొండ, విజయక్రాంతి: మునుగోడు నియోజకవర్గంలో గంజాయి, మత్తు పదార్థాలు కనిపించవద్దని  నిర్మూలనకు పోలీసులు నిబద్దతతో పని చేయాలని మునుగోడు శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశించారు. మునుగోడు పట్టణంలో గంజాయి, మత్తు పదార్థాలు, బెల్టు షాపుల నియంత్రణకు తీసుకోవాలసిన చర్యలపై మునుగోడులోని తన క్యాంపు కార్యాలయంలో  పోలీసులతో ఎమ్మేల్యే సమావేశం నిర్వహించారు. గంజాయి, బెల్టుషాపుల నిర్మూలనకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని అవసరమైతే అరెస్టు చేసి జైల్లోకి పంపాలని ఆదేశాలు జారీ చేశారు.

గంజాయి, బెల్ట్ షాపుల నిర్వహణ అంశాలే కాకుండా అసాంఘిక కార్యకలాపాలకు ఎవరు పాల్పడినా సహించేది లేదని వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.  ఇప్పటివరకు మునుగోడు సర్కిల్లో  బెల్ట్ షాపులు నిర్వహించే  వారిపై 30 కేసులు నమోదు చేశామని.. 105 మందిని బైండోవర్ చేశామని  పోలీసులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. బెల్ట్ షాపుల నిర్మూలనకి  కఠినంగా వ్యవహరించాలని చెప్పారు. మునుగోడు నియోజకవర్గానికి గంజాయి ఎక్కడి నుంచి వస్తుందో మూలాలను తెలుసుకుని ... ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ  నిర్మూలిస్తూనే... గంజాయికి అలవాటైన వారికి కౌన్సిలింగ్ ఇవ్వాలని చెప్పారు.