calender_icon.png 23 April, 2025 | 3:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్లాస్టిక్ వాడకంపై కఠిన చర్యలు

13-12-2024 01:12:53 AM

చేర్యాల, డిసెంబర్ 12: ప్లాస్టిక్‌ను వినియెగించే వ్యాపార సంస్థలపై  కఠినంగా వ్యవహరించాలని చేర్యాల మున్సిపల్ కమిషనర్ నాగేందర్ హెచ్చరించారు. గురువారం మున్సిపల్ సిబ్బందితో కలిసి లైసెన్స్ ఫీజ్ వసూళ్లతో పాటు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా ప్లాస్టిక్‌ను వినియోగిస్తున్న పలు వ్యాపార సంస్థలకు జరిమానాలు విధించారు.  వ్యాపార సంస్థలు, చిరు వ్యాపారులు సకాలంలో లైసెన్స్ ఫీజులు చెల్లించి అభివృద్ధికి సహకరించాలని కోరారు. మున్సిపల్ కార్యాలయ మేనేజర్ ప్రభాకర్, సీనియర్ అసిస్టెంట్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.