నిర్మల్ (విజయక్రాంతి): బ్యాంకుల వద్ద దొంగతనాలు మోసాలు జరుగుతున్న నేపథ్యంలో భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేసుకోవాలని పోలీసు పరంగా సంపూర్ణ సహకారం అందిస్తామని జిల్లా ఎస్పీ జానకి షర్మిల(District SP Janaki Sharmila) అన్నారు. సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్మల్ జిల్లాలోని వివిధ బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. ఇటీవలే ఇతర ప్రాంతాల్లో జరిగిన సంఘటనలు దృష్టిలో పెట్టుకొని నిర్మల్ జిల్లాలో అటువంటి సంఘటన జరగకుండా పోలీస్ శాఖ ముందస్తు చర్యలు తీసుకుంటుందన్నారు. బ్యాంకులు ఏటీఎం కేంద్రాల వద్ద పోలీసుల నిఘాను పెంచడం జరుగుతుందని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. బ్యాంకు కార్యాలయంలో భద్రత చర్యలను మరింత పటిష్ట పరచాలని పేర్కొన్నారు. లాకర్ గది నగదు సొమ్ము భద్రపరిచే గదులు సెక్యూరిటీ గార్డ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీలు రాకేష్, మీనా, ఉపేందర్ రెడ్డి, లీడ్ మేనేజర్ రాంగోపాల్ అధికారులు ఉన్నారు.