బెల్లంపల్లి (విజయక్రాంతి): పల్లెల్లో గంజాయి సేవించినా, అమ్మినా, సరఫరా చేసిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని బెల్లంపల్లి రూరల్ సీఐ సయ్యద్ అఫ్జలుద్దీన్ హెచ్చరించారు. సోమవారం బెల్లంపల్లి మండలంలోని దుగ్నెపల్లి గ్రామంలో నిర్వహించడం కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో భాగంగా ప్రజలతో మాట్లాడారు. గంజాయి సేవించడం వల్ల జరిగే అనర్ధాలను వివరించారు. సైబర్ క్రైమ్ మోసాలను, అరికట్టే విధానాలను, డయల్ 100 ఉపయోగించుకునే విధానంపై ప్రజల్లో అవగాహన కల్పించారు. మూఢనమ్మకాలు, మంత తంత్రాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో తాళ్ల గురిజాల ఎస్సై చుంచు రమేష్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.