calender_icon.png 24 December, 2024 | 7:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కఠిన చర్యలు అవసరం

10-07-2024 12:05:00 AM

తల్లిదండ్రులకు, కుటుంబానికి అండగా ఉండాల్సిన కొందరు యువత గంజాయి బారిన పడుతూ భవిష్యత్తును పాడు చేసుకొంటుండటం దురదృష్టకరం. ఈ మారక ద్రవ్యం నేడు చాలావరకు పాన్ షాపులు, కిరాణా దుకాణాలలో విచ్చలవిడిగా లభ్యమవుతుందంటే నమ్మశక్యం కాకుండా ఉంది. నిర్మానుష్య ప్రదేశాలలో గంజాయి వినియోగించే వారు అడ్డుకున్న వారిపై తిరగబడుతూ దాడులకు పాల్పడుతున్నట్లు తెలుస్తున్నది. గంజాయి బాధితుల లో ఎక్కువమంది నిరుపేద, మధ్యతరగతికి చెందిన వారే కావడం మరింత ఆందోళనకరం.

టీనేజ్ పిల్లలు కొందరు ఆకతాయిలతో కలిసి ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. కొందరు మాదక ద్రవ్యాల సరఫరాదారులు మెడికల్, ఇంజినీరిం గ్ కళాశాలల విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని కాలేజీల సమీపంలోనే గంజాయిని విక్రయిస్తున్నట్టు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి నేరస్థులపై కఠిన చర్యలు తీసుకోవాలి. మత్తు పదార్థాల బారిన పడి చిత్తు కాకుండా తెలంగాణ యువతను ప్రభుత్వమే కాపాడాలి. ఇందుకుగాను ప్రత్యేక టాస్క్‌ఫోర్సును ఏర్పాటు చేసి మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలి. 

 వావిలాల రాజశేఖర్‌శర్మ, నాగర్ కర్నూల్ జిల్లా